NTR-Neel | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘KGF’, ‘సలార్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ యూనివర్స్‌ను సృష్టించిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు తారక్‌ను ఎలా చూపించబోతున్నాడోననే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మే 20న అభిమానులకు భారీ ట్రీట్ ఖాయమని అందరూ భావించారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, అభిమానుల ఎగ్జైట్మెంట్ను మరింత పెంచేలా మేకర్స్ ఒక రోజు ముందుగానే గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అంటే మే 19 అర్ధరాత్రి 12 గంటలకే ఈ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న లీక్స్, సెట్స్ ఫోటోలు అభిమానుల్లో భారీ హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్‌తో ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచం ఎలా ఉండబోతుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మే 18న రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో ఇప్పటికే మెగా అభిమానుల హంగామా మొదలైంది. ఇక దానికి మరుసటి రోజే తారక్ గ్లింప్స్ రావడంతో మెగా-నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ పీక్స్‌కు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ట్రీట్ తారక్‌కు దక్కబోతుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ‘RRR’ తర్వాత తారక్ నుంచి వస్తున్న ఈ భారీ సోలో ప్రాజెక్ట్ కావడంతో ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మే 19 అర్ధరాత్రి విడుదలయ్యే గ్లింప్స్‌లో తారక్ లుక్, క్యారెక్టర్, సినిమా బ్యాక్‌డ్రాప్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. “అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా తారక్ విధ్వంసం మొదలవుతుంది” అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు వైరల్ చేస్తున్నారు.