Meera Rajput | స్టార్ హజ్బెండ్ అని ఎవరూ అనరు.. మరి స్టార్ వైఫ్ అనడం దేనికి? : మీరా రాజ్‌పుత్
జనిసె సెక్విరా మొదటి ఎపిసోడ్లో స్టార్ వైఫ్ పదాన్ని నిషేధించాన్న మీరా
Meera Rajput : సినిమా హీరోల భార్యలు, పిల్లలను తరచూ స్టార్ వైఫ్, స్టార్ కిడ్ అని పిలుస్తుంటారు. మీడియాలో వాళ్ల గురించి చెప్పిన ప్రతిసారి స్టార్ భార్య, స్టార్ కొడుకు, స్టార్ కూతురు అంటూ సంబోధిస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు.. అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ మాట వినిపిస్తుంది. అలా పిలిపించుకోవడం అందరికి నచ్చదు. తనను స్టార్ వైఫ్ అని పిలవడంపై మీరా రాజ్‌పుత్ తాజాగా స్పందించింది. సోషల్‌మీడియా స్టార్ జనిసె సెక్విరా మొదటి ఎపిసోడ్లో ఆమె మాట్లాడుతూ.. ‘స్టార్ హజ్బెండ్ అని ఎవరూ అనరు. మరి స్టార్ వైఫ్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు అని మీరా అంది. స్టార్ భార్య అనే పదాన్ని నిషేధించాలి. ఎందుకంటే.. హీరోల పిల్లలకు స్టార్ కిడ్ అనడం అందరికి నచ్చదు. పైగా దానివల్ల వాళ్లపై నెపోటిజం ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ స్టార్ కిడ్ అనే మాట వినిపిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్ లేదా సెలబ్రిటీని పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఎవరు కూడా స్టార్ హజ్బెండ్ అని అనరు. ఆడవాళ్లను మాత్రమే స్టార్ వైఫ్ అని ఎందుకు పిలుస్తారు?’ అని మీరా ప్రశ్నించింది.
యూట్యూబర్ అయిన మీరా రాజ్‌పుత్, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య. వీళ్లిద్దరూ 2015లో వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత నుంచి ఆమెను అందరూ స్టార్ వైఫ్ అనడం మొదలుపెట్టారు. మీరా యూట్యూబ్‌లో అందం, ఆరోగ్యం గురించి పోస్ట్‌లు పెడుతుంటుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

