Benefits Shows | టాలీవుడ్ హీరోలకు షాక్.. తెలంగాణలో రద్దు కానున్న బెన్ఫిట్ షోలు.?
Benefits Shows In Telangana | తెలంగాణలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు.
Benefits Shows In Telangana | తెలంగాణలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే థియేటర్స్ మూతపడిన షాక్ నుంచి తేరుకొనేలోపే టాలీవుడ్ హీరోలకు మరో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వ్యాప్తంగా బెన్ఫిట్ షోలు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. నైజాంకి చెందిన ఎగ్జిబిటర్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ విషయంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూన్న విషయం తెలిసిందే. అయితే ఈ డిమాండ్‌ను నిర్మాతల మండలి లైట్ తీసుకోవడంతో బెన్ఫిట్ షో రద్దు చేయలానే నిర్ణయానికి వచ్చారు ఎగ్జిబిటర్లు. దీనికి జూన్ 01వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు లాంటి సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాగా.. దీనిపై తెలుగు నిర్మాతల మండలి స్పందిచాల్సి ఉంది.
మరోవైపు బెన్ఫిట్ షోలు రద్దు చేయడం వలన స్టార్ హీరోలకు పెద్ద దెబ్బపడుతుందని సమాచారం. బెనిఫిట్ షోలు లేకపోతే… సినిమా బృందానికి తీవ్ర నష్టమే కాకుండా… సినిమాపై హైప్ కూడా తగ్గిపోతుందని.. సినిమా ఫస్ట్ టాక్ వచ్చేదే బెనిఫిట్ షో వలన అని.. దానినే రద్దు చేస్తే ప్రేక్షకులలో సినిమాలపై ఆసక్తి తగ్గుతుందని నిర్మాతల మండలి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

