Multi starrer movies | పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్… మామ అల్లుళ్ల కాంబినేషన్లో మల్టీ స్టారర్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. వినోధయ సీతమ్ చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా.. తెలుగులో కూడా సముద్రఖని (Vinodaya Sitham remake) లో డైరెక్ట్ చేస్తున్నాడు.
టాలీవుడ్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం వినోధయ సీతమ్. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండగా.. తెలుగులో కూడా సముద్రఖని (Vinodaya Sitham remake) డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రఖని, పవన్, సాయిధరమ్ అండ్ టీం సినిమాను షురూ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. విడుదల చేసిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిందే. పవన్ కల్యాణ్ కు జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్ కనిపించనుందని ఇప్పటికే నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇందులో పవన్ కల్యాణ్ పక్కన ఫీ మేల్ లీడ్ రోల్ లాంటిదేమి ఉండదని, సోలోగా మాత్రమే కనిపించనున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. కథానుగుణంగా సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ కనిపించనుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో మెరవనుందని ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మరి ఈ అప్డేట్పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. తెలుగు నేటివిటీతోపాటు పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్లుగా తెలుగు వెర్షన్లో మార్పులు చేసినట్లు ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

