Telangana High Court | ప్రీమియర్, బెనిఫిట్ షోలకు నో.. 16 ఏండ్ల పిల్లలకు అన్ని షోలకి అనుమతి
Telangana Benfit Shows | తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది.
Telangana High Court | తెలంగాణలో బెనిఫిట్ (Benefit Shows) షోలు, ప్రీమియర్(Premiere) షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణలో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని హైకోర్టు మరోసారి తెలిపింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను నేడు సవరించిన హైకోర్టు ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది. అలాగే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. మరోవైపు 16 ఏండ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం.. అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని.. ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం గత నెల ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

