Nivetha: కిలిమంజారో పర్వతంపై జెండా పాతిన వకీల్ సాబ్ బ్యూటీ

ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్. సూపర్ ఉమెన్ కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాను సాధించానని సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఫోటో, ఆమె పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా నివేదాను అభినందిస్తున్నారు.
నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన నివేదా థామస్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది.
చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. కాని దానిని విజయవంతంగా పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది నివేదా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

