నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాతో మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నాయిక అంజలి మెరుపులు మెరిపించనుంది. పాటలోని ఆమె లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో అంజలి పాట మాస్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా సమాతంరంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల.