హీరోలు త్యాగం చేయాల్సిందే
రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు నితిన్. జయాపజయాలను ఎదుర్కొని స్థిరంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన నటించిన కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి, కేథరీన్ థ్రెసా నాయికలు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎం.ఎస్ రాజశేఖర రెడ్డి రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు నితిన్.
ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ చేయాలని ఎందుకనిపించింది?
20 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. లవ్ స్టోరీస్‌లో నటించి విసిగొచ్చింది. దాంతో నెక్ట్స్ లెవెల్‌కు ప్రయత్నిద్దాం అనిపించింది. నేను ఇలాంటి పూర్తి కమర్షియల్ చిత్రంలో నటించి చాలా రోజులవుతున్నది. ఇందులో నా పాత్ర పవర్‌పుల్‌గా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్నది ఏమిటి?
కథ బాగా నచ్చింది. అలాగే ఇప్పటిదాకా నేను ఐఏఎస్ పాత్రలో నటించలేదు. ఆ క్యారెక్టర్ ఆకట్టుకుంది. మాస్ సినిమా అయినా ఇందులో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. యథార్థ ఘటనల స్ఫూర్తి ఏదీ లేదు. పూర్తిగా కల్పిత కథ ఇది. ప్రథమార్థం అంతా వినోదాత్మకంగా సాగుతుంది. వెన్నెల కిషోర్ బాగా నవ్విస్తాడు. ఇంటర్వెల్ నుంచి మాస్, యాక్షన్ మొదలవుతుంది.
దర్శకుడు రాజశేఖర రెడ్డి పనితనం గురించి చెప్పండి?
రాజశేఖర రెడ్డి నాకు మిత్రుడు. నా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. నా ‘లై’ సినిమా షూటింగ్ టైమ్‌లో సన్నివేశాలకు అతను చెప్పిన ఇన్పుట్స్ బాగా నచ్చాయి. నువ్వు దర్శకత్వం చేయొచ్చు కదా అని నేనే సలహా ఇచ్చాను. లాక్డౌన్ టైమ్‌లో ఈ కథ రాసి నాకు వినిపించాడు. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పాను. అతను ఎడిటర్ అవడం వల్ల ఏది ఎంత వరకు షూట్ చేయాలో ప్లాన్ చేసుకున్నాడు. అదనంగా ఏదీ తెరకెక్కించలేదు.
ఐఏఎస్ అధికారి పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
ఐఏఎస్ పాత్ర కాబట్టి దర్శకుడు కొంత వర్క్ చేశాడు. ఎక్కడ హుందాగా ప్రవర్తించాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలి అనేది రీసెర్చ్ చేశాడు. అతను చెప్పిన ఇన్‌పుట్స్‌తో నేను నటించాను.
కోవిడ్ తర్వాత పరిశ్రమలోని పరిస్థితులపై మీ స్పందన
ఇప్పుడు ఏ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడతారో, దేన్ని తిరస్కరిస్తారో తెలియడం లేదు. ప్రేక్షకుల మూడ్ అర్థం కావడం లేదు. ట్రైలర్ లేదా పాటలు నచ్చితే థియేటర్‌కు వస్తున్నారు. అక్కడ మెప్పిస్తే ఆదరిస్తున్నారు. అయితే కామెడీ, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఇలా అన్నీ బాగా కుదిరిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
మీ గత రెండు చిత్రాలకు ఆశించిన ఫలితం రాలేదు కదా
నా గత చిత్రాల్లో ‘మాస్ట్రో’ మూవీ ఓటీటీలో నేరుగా విడుదలైంది. ‘చెక్’ ప్రేక్షకులకు కనెక్ట్ కాదని ముందే ఊహించాను. ‘రంగ్ దే’ విజయం సాధిస్తుందని ఆశించాను కానీ అప్పుడే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం కావడం వల్ల ఆ ప్రభావం సినిమా ఫలితం మీద పడింది. ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోయారు.
ఇరవై ఏళ్ల కెరీర్‌ను ఎలా విశ్లేషించుకుంటారు?
సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ చూశాను. నా కంటే ఎక్కువ ప్లాప్స్ ఇచ్చిన హీరోలు ఎవరా అని గూగుల్‌లో వెతికేవాడిని. ఎవరైనా ఉంటే హమ్మయ్య మనకేం ఫర్వాలేదు అనిపించేది. సోషల్ మీడియాలో మహమ్మద్ ఘజనీలా హిట్ కోసం పోరాడుతున్నాడు అని కామెంట్స్ రాసేవాళ్లు. అవన్నీ తట్టుకుని ఇప్పుడు ఒక స్థాయిలో నిలబడ్డాను.
పాన్ ఇండియా మూవీ ట్రెండ్‌పై మీరేమంటారు
పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథ దొరికితే తప్పకుండా నటిస్తాను. నాకు ‘విక్రమ్’ లాంటి చిత్రాలు చేయాలని ఉంది. ఆ సినిమా చూసిన కొన్ని రోజుల పాటు ఇది కదా సినిమా అనిపించింది. అలా రెండు మూడు ప్రధాన పాత్రలతో కథ వస్తే నటిస్తాను. ఈ తరహా చిత్రాలు రావాలంటే హీరోలు త్యాగం చేయాల్సిందే. నాకు హీరోయిన్‌తో పాటలు, విలన్లతో ఫైట్స్ ఉండాలంటే కొత్త సినిమాలు రావు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

