Nithiin-Venky Kudumula Movie | దాదాపు ఏడేళ్ల స్ట్రగుల్ తర్వాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ కుర్ర హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన ‘అఆ!’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ విజయం సాధించడంతో నితిన్‌పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దాంతో ఆ తర్వాత నితిన్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవ్వలేక వరుస డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. మధ్యలో ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన ఆ తర్వాత మళ్లీ హాట్రిక్ ఫ్లాపులు పడటంతో ఆ హిట్ కాస్త కనిపించకుండా పోయింది.
ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఎక్స్ట్రా ఆర్డీనరి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ లవర్స్ మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్.. తన కెరీర్లో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రేపో మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నితిన్ యంగ్ లుక్‌లో కనుపించనున్నాడని ఇన్సైడ్ టాక్. వెంకీ ఈ సినిమా కోసం ఓ సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను రాసుకున్నాడట. అందులో 21ఏళ్ల కుర్రాడిలా నితిన్‌ను చూపించనున్నాడట.
వీఎఫ్ఎక్స్ సహాయంతో నితిన్‌ను కుర్రాడిలా సహజంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. నలభై ఏళ్లున్న నితిన్‌ను దాదాపు 20ఏళ్లు తగ్గించి చూపడం అనేది కత్తి మీద సామే. పైగా వీఎఫ్ఎక్స్ అంటున్నారు కాబట్టి ఏ మాత్రం తేడా కొట్టిన చిత్రయూనిట్ ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అవడం ఖాయం. ఈ సినిమా కథ.. ఒక అరుదైన వ్యాధి వల్ల నెలరోజుల్లో చనిపోతానని తెలిసిన ఒక అబ్బాయి.. ఆ నెల రోజులు తన జీవితాన్ని ఎలా గడిపాడు. తన జీవితానికి దక్కిన ముగింపేంటీ అనే నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
లైన్ వింటుంటే ఇదొక ట్రాజెడిక్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ వెంకీ తన స్టైల్ కామెడీతో ఈ సినిమాను రూపొందించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జీ.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చుతున్నాడు. నిజానికి వెంకీ తన తదుపరి సినిమాను చిరుతో చేయాల్సిఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.