Karthikeya-3 | ‘కార్తికేయ’ తెలుగులో హిట్టయితే.. ‘కార్తికేయ-2’ తెలుగుతోపాటు బాలీవుడ్లో కూడా రికార్డుల మోత మోగించేసింది. తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన కథల్లో ‘కార్తికేయ’ ఫ్రాంచైజీని కూడా చెప్పుకోవాలి. అందుకే.. అ అద్భుతాన్ని కొనసాగిస్తూ ‘కార్తికేయ-3’ని ఖరారు చేసేశాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్. దర్శకుడు చెందు మొడేటి మూడోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మొదటి రెండు భాగాలను మించే స్థాయిలో ఈ మూడో భాగం ఉండబోతున్నదని, స్పాన్, స్కేల్ పరంగా చాలా బిగ్గర్గా ఈ సినిమా ఉండబోతున్నదని చందు మొండేటి నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.