నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనందించిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సినిమాలో తమిళ హీరో శింబు పాడిన ‘టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు..’ అనే పాటను సోమవారం విడుదల చేశారు.
శ్రీమణి ఈ గీతాన్ని రాశారు. ‘బ్రేకప్ అయిన యువకుడు పాడుకునే పాట ఇది. చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. హృదయాన్ని తడిమే భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది.