దుష్టశిక్షణలో స్వయంభూ
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో యుద్ధవీరుడి పాత్ర కోసం నిఖిల్ చేసిన కఠోర శ్రమను చూపించారు. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రొఫెషనల్ ట్రెయినర్ల పర్యవేక్షణలో కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారని మేకర్స్ తెలిపారు.
వీడియో చివరలో చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. వీటిలో యుద్ధ కవచం ధరించిన నిఖిల్ శత్రువులపై విరుచుకుపడటం, అగ్ని జ్వాలల మధ్య పోరాటాలు రోమాంఛితంగా అనిపించాయి. ఈ సినిమాలో నిఖిల్..చోళ యుద్ధ వీరుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఓ సామాన్యుడు చారిత్రక పురుషుడిగా మారే వైనం కథలో ఆసక్తికర అంశమని చెబుతున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది. సంయుక్త, నభానటేష్ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: భువన్, శ్రీకర్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

