Niharika: వెబ్ సిరీస్ నిర్మిస్తున్న నిహారిక.. సీక్రెట్ రివీల్ చేసిన మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక(Niharika) డిజటిల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. సినిమాలతో పెద్దగా అలరించలేకపోయిన కూడా వెబ్ సిరీస్‌లతో మాత్రం మాంచి ఎంటర్టైన్మెంట్ని అందించింది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి జోరు తగ్గలేదు. సినిమాలు, వెబ్ సిరీస్(Web Series)లు చేస్తూ బిజీగానే ఉంది. అయితే రీసెంట్గా జీ5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది.
జీ 5 చేసిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన నిహారిక తన తండ్రి బర్త్ డే రోజు అప్డేట్ ఇస్తానని అని పేర్కొంది. గత కొద్ది రోజులుగా ‘ఓసీఎఫ్ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో అందరి మతులు పోగొట్టిన నిహారిక.. నాగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది. ఓసీఎఫ్ఎస్ అంటే ఏంటో తెలియజేస్తూ ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.
ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అర్థం అనే విషయాన్ని నిహారిక రివీల్ చేశారు. నిహారిక ‘ఓసీఎఫ్ఎస్’ అనే వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లు కాగా, టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న ఉండనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

