ప్రస్తుతం పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాతో బిజీగా ఉంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. క్రిష్-పవన్ కల్యాణ్ కాంబోలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. నిధిఅగర్వాల్ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. పవన్‌తో కలిసి పనిచేయడం గురించి చిట్ చాట్‌లో షేర్ చేసుకుంది.
పవన్‌తో వర్క్‌చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పింది. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా థ్రిల్‌ను కలిగించింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రిష్ నన్ను ఎలా చూపిస్తారని చాలా ఎక్జయిటింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది నిధి. శ్రీరామ్ ఆదిత్య సినిమాతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తోంది నిధి అగర్వాల్. పవన్‌కల్యాణ్-క్రిష్ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది నిధి. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద హిట్టయితే నిధి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయమైనట్టే.