Nidhhi agerwal | నిధితో నీచంగా ప్రవర్తించారు… హైదరాబాద్‌లో రాజా సాబ్ హీరోయిన్‌కు చేదు అనుభవం!!
Nidhhi agerwal | టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Nidhhi agerwal | టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ను బుధవారం హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లూలు మాల్లో ఘనంగా విడుదల చేశారు. ప్రభాస్–నిధి అగర్వాల్ మధ్య చిత్రీకరించిన ఈ పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సాంగ్ లాంచ్ ఈవెంట్ ముగిసిన అనంతరం నిధి అగర్వాల్‌కు అభిమానుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
కార్యక్రమం పూర్తయ్యాక కారు వద్దకు వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఫోటోలు, సెల్ఫీల కోసం అత్యుత్సాహంతో ముందుకు రావడంతో గందరగోళం ఏర్పడింది. కొంతమంది అభిమానులు ఆమెపై పడిపోయినంత పని చేయడంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బాడీగార్డుల సహాయంతో చివరకు ఆమె ఎలాగోలా కారులోకి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆ సమయంలో నిధి ఎంత ఇబ్బంది పడ్డారో ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా నిధి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.
నిధి అగర్వాల్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, ఆమె తొలి చిత్రం ‘సవ్యసాచి’. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నిధి మాత్రం తన అందం, అభినయం, డాన్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆమెకు బ్లాక్‌బస్టర్ హిట్ లభించింది. ఈ విజయంతో టాలీవుడ్లో నిధి అగర్వాల్ టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’లో కీలక పాత్రలో కనిపించిన ఆమె, ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’లో నటిస్తూ మరోసారి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Vultures Disguised As Fans; Prabhas Starrer “The Raja Saab” Actress Nidhhi Agerwal, was literally gets Mobbed and Crushed by Fans at a Song Launch event in Hyderabad on Wednesday.#NidhhiAgerwal #Prabhas #Hyderabad #TheRajaSaab #SahanaSahana pic.twitter.com/omOzynRQcj
— Surya Reddy (@jsuryareddy) December 17, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

