Bheemla Nayak: భీమ్లా నాయక్ పాటపై ఐపీఎస్ ఆఫీసర్ అభ్యంతరం

ఈ మధ్య సినిమాకి సంబంధించి ఏ పాట విడుదలైన, టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన దానిపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే పాటలో పోలీసులని కించపరిచేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసారని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టమని చురకలు అంటించారు డీసీపీ. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయని ట్వీట్ చేశారు. పాటలో పోలీసుల సేవల గురించి ఎక్కడా రాయలేదని డీసీపీ తన ట్వీట్లో తెలిపారు. ఇక కొందరు పాట బాగోలేదు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.
Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s
— Ramesh Masthipuram IPS (@MRAMESHIPS) September 2, 2021
ఓ నెటిజన్ మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు అంటూ రామజోగయ్య శాస్త్రికి చురక అంటించాడు. దీనికి స్పందించిన రామజోగయ్య శాస్త్రి నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. నెటిజన్స్ కామెంట్స్ కి స్పందిస్తున్న రామజోగయ్య… డీసీపీ ట్వీట్‌కి కూడా స్పందిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next time baaga raasthaa tammudu
— RamajogaiahSastry (@ramjowrites) September 3, 2021
Plz 😎 https://t.co/v20STfBNg5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

