యంగ్హీరో హవీష్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. నిఖిల కోనేరు నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాలెంటైన్స్ కానుకగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్ని శనివారం మేకర్స్ విడుదల చేశారు. హవీష్, కావ్యాథాపర్ రొమాంటిక్గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపలక్ష్మి, జయవాణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: హార్నిక్స్ ఇండియా ఎల్.ఎల్.పి.