అభిరామ్వర్మ, సాత్వికా రాజ్ జంటగా బాలుశర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీతో’. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు హను రాఘవపూడి విడుదల చేశారు. ‘మనకు రిలేషన్షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ..ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తుకు రాదు’ వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమికుల సంఘర్షణకు అద్దం పట్టే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్, సంగీతం: వివేక్ సాగర్, దర్శకత్వం: బాలు శర్మ.