అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నెల 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా తాలూకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది. బాలకృష్ణను సరికొత్త అవతారంలో ఆవిష్కరించే సినిమా ఇదని క్యాప్షన్‌ను బట్టి అర్థమవుతున్నది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.