టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107 (NBK 107) చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయని వీడియోతో స్పష్టమవుతుంది.
అయితే ఇదిలా ఉంటే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో చేయబోతున్న ఎన్బీకే 108 (NBK 108) ప్రాజెక్టు రిలీజ్ టాపిక్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ సినిమాను వచ్చే సమ్మర్ సీజన్లో విడుదల చేయాలనుకుంటున్నారట నిర్మాతలు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా 2023 ఏప్రిల్‌లో రానుందట. మరి దీనిపై బాలకృష్ణ-అనిల్ రావిపూడి టీం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లని ఈ సినిమాను ఇంత తక్కువ టైంలో పూర్తి చేసి..త్వరగా ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకువస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల బాలకృష్ణ కూతురిగా కనిపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కామెడీ టచ్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును సాహు గారపాటి నిర్మించనున్నారు.