Naveen Polishetty | సార్.. గన్ ఎలా పట్టుకోవాలో నేర్పించండి .. పోలీస్ ఈవెంట్లో నవీన్ పోలిశెట్టి కామెడీ
Naveen Polishetty | టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా తన హాస్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. తెరపై తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే నవీన్, నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటూ అందరినీ అలరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ పోలీస్ కార్యక్రమంలో ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి.
Naveen Polishetty | టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా తన హాస్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. తెరపై తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే నవీన్, నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటూ అందరినీ అలరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ పోలీస్ కార్యక్రమంలో ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం హాస్యంతో పాటు పోలీస్ శాఖపై ఉన్న గౌరవాన్ని కూడా ప్రతిబింబించింది.
ఇటీవల మహిళల భద్రత కోసం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన అండర్కవర్ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన నవీన్, ఆమె పనితీరును ప్రశంసిస్తూ సరదాగా స్పందించారు. సుమతి మేడమ్ చాలా బాగా నటించారు. నా తదుపరి సినిమాలో ఆమె తప్పకుండా నటించాలి. నేను, సుమతి మేడమ్ కలిసి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్లో ఒక కేసును ఛేదించాలని కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పారు. ఆయన కామెంట్స్కి సభలో చప్పట్లు మార్మోగాయి.
అలానే కార్యక్రమంలో మరో సరదా సంఘటన కూడా చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పోలీస్ అధికారులను ఉద్దేశించి నవీన్, “సార్… నాకు గన్ ఎలా పట్టుకోవాలో కాస్త నేర్పించండి” అని కోరారు. దీనికి స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్ సరదాగా, ట్రైనింగ్ ఇస్తాం కానీ… ఒరిజినల్ బుల్లెట్లతో మాత్రం కాదు అని అనడంతో సభలో నవ్వులు పూశాయి. దానికి వెంటనే నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో,మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే ఉంటాయి సార్… అయినా నాకు గన్ ఎత్తడం కూడా రాదు అని చెప్పడంతో అక్కడున్న పోలీస్ అధికారులు, అతిథులు అందరూ గట్టిగా నవ్వేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. తన కెరీర్లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా దేవుడిని గుర్తు చేసుకుంటాం. కానీ ఆ దేవుడు రావడానికి సమయం పడితే, మనకు వెంటనే గుర్తొచ్చేది పోలీస్ శాఖ. ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. అలాంటి నిస్వార్థ సేవ చేస్తున్న పోలీస్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని నవీన్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

