రాజుగారి పెళ్లి హంగామా
యువ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
యువ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ‘రాజుగారి పెళ్లిరో’ అనే గీతాన్ని విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో ఉత్సాహభరితంగా సాగిందీ పాట. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రచించారు.
నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హుషారైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ పాటకు కొత్త జోష్ తీసుకొచ్చారు. ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాట అవుతుందని మేకర్స్ తెలిపారు. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే ఫ్యామిలీ డ్రామా ఇదని, భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: మారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

