పోస్టర్ మీద రాస్తే పాన్ ఇండియా మూవీ కాదు
విభిన్న చిత్రాలతో మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కథానాయకుడు నాని. ఆయన నటించిన కొత్త సినిమా ‘అంటే సుందరానికీ..’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించారు. నజ్రియా ఫహాద్ నాయిక. ఈ నెల 10న సినిమా విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన అనుభవాలు, కెరీర్ విశేషాలు తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు నాని.
కొత్త దర్శకులతో పనిచేయడానికి కారణమేంటి?
సీనియర్ దర్శకులతో పనిచేయడం కంటే రేపు గొప్ప దర్శకులు అయ్యేవారితో కలిసి పనిచేస్తే వాళ్ల జర్నీలో నేనుంటానని అనిపించింది. నేను ఇప్పటిదాకా పనిచేసిన గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యన్ ఇప్పుడు వివేక్ గానీ వీళ్లు పేరుకు రెండు మూడు సినిమాలే చేసిన వాళ్లే కావొచ్చు కానీ ప్రతిభావంతులు. వివేక్ ఈ కథ చెప్పినప్పుడు, ఆయన గత సినిమాలు చూసినప్పుడు మనం రేపు చూడబోయే గొప్ప దర్శకుల్లో ఒకరు అవుతారనే నమ్మకం కలిగింది.
ఈ చిత్రంలో మీకు ప్రత్యేకంగా అనిపించిన అంశాలేమిటి?
సినిమాలో అందమైన కథ ఉంది. ఈ కథను తనదైన ప్రత్యేక శైలిలో దర్శకుడు తెరకెక్కించాడు. సాధారణంగా కొన్ని అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి కాబట్టి వాటిని సినిమాలో చూపించాలని ప్రయత్నిస్తాం. కానీ ఈ సినిమాలో దర్శకుడు తను అనుకున్న వాటిని నిజాయితీగా తెరకెక్కించారు. ఫార్ములాల జోలికి వెళ్లలేదు. ఈ కథను ఏ దర్శకుడికి ఇచ్చినా ఇలా తెరకెక్కించలేరు.
‘అంటే సుందరానికీ…’ ఎలా ఉండబోతున్నది?
గతంలో నేను చేసిన వినోదాత్మక చిత్రాల్లో దేంట్లోనూ చూపించని కొత్త హ్యూమర్ టైమింగ్, ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. నేను పాత నానిలా నటించాలనుకున్నా నటించలేకుండా దర్శకుడు మార్చేశాడు. ఆయన రైటింగ్ ైస్టెల్ అలా నేను కొత్తగా నటించేలా చేసింది. సినిమా చూస్తూ కావాల్సినంత నవ్వుకుంటారని మాత్రం చెప్పగలను.
సుందర్ పాత్రకు ఎలా సన్నద్ధమయ్యారు
ఇలాంటి ప్రత్యేకమైన క్యారెక్టర్స్‌తో సినిమా చేసినప్పుడు మనం ఉన్నదాని కంటే కొంత ఎక్కువ చేసి నటిస్తుంటాం. బ్రాహ్మణ కుర్రాడి క్యారెక్టర్ అంటే ఏమిటీ అని దీర్ఘం తీసి చెప్పే డైలాగ్స్ పెడుతుంటాం. వాళ్లు నిజానికి అలా మాట్లాడరు. మనలాగే మామూలుగా మాట్లాడుతారు. ఈ విషయంలో సుందర్ పాత్ర హడావుడి చేయకుండా ప్రవర్తిస్తుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ బ్రాహ్మణ అబ్బాయి. ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో జరిగినవి, చూసిన సందర్భాలు సినిమాలో పెట్టాడు. అవి చాలా సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో నాయికకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది?
సుందర్, లీలా అనే రెండు పాత్రలు కీలకంగా ఉండే కథ ఇది. అందుకే టైటిల్లో నాని, నజ్రియా మూవీ అని పెట్టాం. నా సినిమాలకు నాని స్టారింగ్ అని టైటిల్ మీద రాసుకుంటాను. కానీ ఈ సినిమాకు అలా చేస్తే తప్పవుతుంది. మేము సినిమా ప్లాన్ చేసినప్పుడు లీల పాత్రకు నజ్రియా లాంటి నాయిక కావాలనుకున్నాం. లక్కీగా ఆమే నటించింది. పెద్ద సినిమాలు వదులుకున్న నజ్రియా మా కథ విని వెంటనే నటిస్తానని ఒప్పుకుంది.
టికెట్ రేట్లు ఇప్పుడు పెరిగి ప్రేక్షకులకు భారంగా మారాయి, ఈ పరిస్థితిపై మీ స్పందన
ఈ మధ్య సోషల్ మీడియాలో నన్ను కొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు టికెట్ రేట్లు పెంచమన్నారు. ఇప్పుడు చూడండి 500 చేశారు అంటున్నారు. నేను అప్పుడు అడిగింది థియేటర్లో బేసిక్ టికెట్ రేట్లను పెట్టమని ఇంత భారీగా పెంచమని ఎవరు అడిగారు. 30,40 రూపాయలు ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎలా బతుకుతారు అని అడిగాను. నేను ఏ సందర్భంలో అన్నానో తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఏవో ఒకట్రెండు అరుదైన చిత్రాలకు తప్ప అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం తప్పే.
తెలుగు సినిమా ప్రాధాన్యం జాతీయి స్థాయిలో పెరగడం పట్ల మీరేమంటారు?
ఏ భాష సినిమా అయినా బాగుందంటే భాషలకు అతీతంగా చూస్తున్నారు. ఇది తెలుగు సినిమాకు కాదు సినిమాకే స్వర్ణయుగం అనుకోవాలి. సినిమాలకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. నా దృష్టిలో పాన్ ఇండియా సినిమాల కోసం మనం ప్రత్యేకంగా కసరత్తులు చేయాల్సిన పనిలేదు. మంచి సినిమా చేస్తే అదే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంది. ‘పుష్ప’ మన అడవిలో జరిగే కథ, బాలీవుడ్‌కు ఏ సంబంధం లేదు. అయినా అక్కడ ఘన విజయం సాధించలేదా? మనం పోస్టర్ మీద పాన్ ఇండియా అని వేసుకుంటే అది పాన్ ఇండియా కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తే అవుతుంది.
‘దసరా’ షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
దాదాపు 25 శాతం చిత్రీకరణ జరిపాం. నేను ఎక్కువ శ్రమిస్తూ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే.
నిర్మాతగా మీరు చేస్తున్న సినిమాలేంటి?
‘మీట్ క్యూట్’ అనే సినిమా చేస్తున్నాం. ఇది నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ అనే సినిమాను నిర్మించాను. ఆ సినిమాను జూలైలో విడుదల చేయబోతున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

