Dasara | స్పీడుమీదున్న నాని..’దసరా’కు క్లాప్ కొట్టేశాడు
చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ హీరో నాని (nani) ఇపుడు దసరా (Dasara)అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు న్యాచురల్ స్టార్ హీరో నాని (nani). చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న ఈ హీరో ఇపుడు దసరా (Dasara)అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. కీర్తిసురేశ్ (Keerthy Suresh)తోపాటు నాని సెల్ఫ్ క్లాప్ కొట్టి..ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela )సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ మెంటార్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. డైరెక్టర్ కిశోర్ తిరుమల స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శ్రీకాంత్, నిర్మాత సుధాకర్‌కు అందజేశాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Natural star @NameisNani & @KeerthyOfficial's Rural MASS Entertainer #Dasara movie launched with a Pooja Ceremony today
Regular shoot commences this March.
Directed by @odela_srikanth@Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/IfSjnfEmZJ
— BA Raju's Team (@baraju_SuperHit) February 16, 2022
నాని మరోవైపు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

