బాలయ్యను ఎందుకు పిలవట్లేదు.. విభజించి పాలించకండి.. చిరంజీవి ఇంట్లో మీటింగ్‌పై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కొందరు విమర్శిస్తుంటే.. బాలయ్య లేకుండా మీటింగ్స్ పెట్టుకోవడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Tollywood | టాలీవుడ్లో ఒకవైపు మా అధ్యక్ష ఎన్నికల ( MAA Elections )కు సంబంధించి వివాదాలు జరుగుతూనే ఉండగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ గురించి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కొందరు విమర్శిస్తుంటే.. బాలయ్య లేకుండా మీటింగ్స్ పెట్టుకోవడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత నట్టి కుమార్ ( Natti kumar ) కూడా చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రావాలని ఏపీ సీఎం జగన్ ఇటీవల చిరంజీవిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో భేటీలో ముఖ్యమంత్రికి విన్నవించాల్సిన విషయాలపై ముందుగా చర్చించేందుకు హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంట్లో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో నట్టి కుమార్ స్పందించారు. చిరంజీవి అంటే తమకు గౌరవం, నమ్మకం రెండూ ఉన్నాయన్న నట్టి కుమార్.. దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని మొదట అన్నది తానేనని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం ఆ నమ్మకం పోతుందేమోన్న భయం కలుగుతుందని చెప్పాడు. ఇప్పటికైనా విభజించి పాలించడం మానుకోవాలని సూచించాడు.
చివరిసారి కూడా చిరంజీవి ఇంట్లోనే సమావేశం పెట్టారని.. ఆ మీటింగ్ సారాంశం ఏంటని ప్రశ్నించారు. చిరంజీవి మీటింగ్‌లో నాగార్జున, పెద్ద నిర్మాతలు తప్ప.. ఇతర పెద్దహీరోలు, చిన్న నిర్మాతలు ఒక్కరూ లేరన్నారు. చిన్న సినిమాల నిర్మాతలు మీకు గుర్తున్నారా? లేదా? అని ప్రశ్నించాడు. మీటింగ్స్ కు బాలయ్యను ఎందుకు పిలవడం లేదు.. ఆయన మీ కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు నట్టి కుమార్. చిన్న,పెద్ద వాళ్ళను కలుపుకొనిపోవాలని, ఇకనైనా ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన అందరివాడిగా ముందుకెళ్లాలని సూచించాడు.
ఇక ఓటీటీలో సినిమాల విడుదలపై కూడా నట్టి కుమార్ స్పందించారు. సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతలే నారప్ప వంటి పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటే.. థియేటర్లకు అన్యాయం చేసినట్టే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అదేబాటలో మాస్ట్రో, టక్ జగదీష్ వంటి సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల వల్లే తాము పెద్ద వాళ్లమయ్యామని.. ఇంత ఇమేజ్ వచ్చిందని సినీ పెద్దలు మరిచిపోకూడదన్నారు. కాబట్టి ఇండస్ట్రీలో సమస్యలు తెలుసుకోవడానికి చిన్నా పెద్దా అందరితో చర్చలు జరిపి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిరంజీవిని కోరుతున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
Power star | పవన్ కళ్యాణ్‌కు నిజంగానే అప్పులున్నాయా?
చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించిన సల్మాన్ ఖాన్..?
పుష్ప టీంను వణికిస్తున్న లీకుల బెడద.. బయటకొచ్చిన మరో సాంగ్
TNR, కత్తి మహేష్ అభిమానులు ఎమోషనల్..కారణమిదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

