Raj Tarun | హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు..!
Raj Tarun | సినీ నటుడు రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. 420, 506, 493 సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Raj Tarun | సినీ నటుడు రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. 420, 506, 493 సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హీరో రాజ్ తరుణ్‌తో 2012 నుంచి రిలేషన్లో ఉన్నట్లు లావణ్య పేర్కొంది. ఇటీవల మరో సినీనటితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ‘తిరగబడర సామీ’ మూవీ షూటింగ్ నాటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిసిందని.. ఇదే విషయంపై నిలదీస్తే తనను దుర్భాషలాడినట్లుగా తెలిపింది. తనను బెదిరింపులకు గురి చేశారని.. సంబంధం లేని కేసులో ఇరికించడంతో పాటు 43 రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందని వాపోయింది.
ఇద్దరికి పదేళ్ల కిందట పెళ్లియ్యిందని, ఇద్దరం కలిసే జీవిస్తున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల కిందట తనకు అబార్షన్ చేయించాడని చెప్పింది. అన్విక పేరుతో రాజ్ తరుణ్‌తో కలిసి ఉన్నానని.. ఆ పేరుతోనే విదేశాలకు వెకేషన్లకు సైతం వెళ్లివచ్చినట్లు చెప్పింది. మరో హీరోయిన్ పరిచయం అయినప్పటి నుంచి తనను రాజ్‌తరుణ్ దూరం పెట్టినట్టు ఆరోపించింది. ఈ కొత్త ఫిర్యాదుతో పలు ఫొటోలు, వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్, స్కీన్షాట్లను సైతం లావణ్య పోలీసులకు అందించినట్లు తెలిపింది. నటి కారణంగానే తనను రాజ్‌తరుణ్ వదిలేశారని లావణ్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై రాజ్‌తరుణ్, ‘తిరగబడర సామీ’ మూవీ హీరోయిన్ సైతం ఖండించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

