Cinema News | మెలోడీ ప్రధానంగా ప్రేమ భావాల సూఫియానా..
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఫూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Cinema News | నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్’. అంజి కంచిపల్లి దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ఫూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ ప్రధానంగా సాగే ‘సూఫియానా..’అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను రామ్ మిర్యాల స్వరపరచడంతో పాటు సమీర భరద్వాజ్, రమ్యశ్రీతో కలిసి ఆలపించారు.
శ్రీమణి సాహిత్యాన్నందించారు. గోదావరి అందాల నేపథ్యంలో చక్కటి సాహిత్యంతో కన్నుల పండువగా ఈ పాట సాగింది. ప్రేమికుల మదిలోని భావాలకు అద్దం పట్టే చక్కటి గీతమిదని, శ్రావ్యమైన బాణీతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకుడు: అంజి కంచిపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

