అందుకే నేను బోర్ కొట్టడం లేదు
నాని, నజ్రియా ఫహాద్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన సినిమా ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ నెల 10న సినిమా విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన నటుడు వీకే నరేష్ తన అనుభవాలు పంచుకున్నారు.
నాని, నజ్రియా ఫహాద్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన సినిమా ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ నెల 10న సినిమా విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో తండ్రి పాత్రలో నటించిన నటుడు వీకే నరేష్ తన అనుభవాలు పంచుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…‘అ..ఆ’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
నానితో నాది హిట్ కాంబినేషన్. నాని కామెడీ టైమింగ్ బాగుంటుంది. నేనూ అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి మా సీన్స్ బాగా వస్తుంటాయి. ఇప్పటిదాకా బెస్ట్ ఫాదర్ రోల్ ఈ చిత్రంలోనే చేశాను. అగ్గిపుల్ల, అగ్గిపెట్టెలా మా ఇద్దరి కామెడీ టైమింగ్ ఉంటుంది. దర్శకుడు వివేక్ ఈ పాత్రను అందంగా మలిచారు. మా రెండు పాత్రల మధ్య రకరకాల భావోద్వేగాలు వస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. ఎక్కువ సీన్స్ మా మధ్య వస్తుంటాయి.
ఈ సీజన్లో చాలా యాక్షన్ సినిమాలు చూశాం. అవన్నీ మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు కుటుంబ ప్రేక్షకుల కోసం సినిమాలు కావాలి. మాది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సరైన సమయంలో మా సినిమా విడుదలకు వస్తున్నది. ఈ సీజన్లో ఆణిముత్యం లాంటి ఫిలిం అవుతుంది. మైత్రీ సంస్థకు మంచి విజయాన్ని అందిస్తుంది. అన్నీ సరిగ్గా కుదిరిన సినిమా ఇది. ఇవాళ కులాంతర, మతాంతర వివాహాలే కాదు ఖండాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఆ ట్రెండ్‌కు అద్దం పట్టే చిత్రమిది. కొంత అనుభవం వచ్చాక నటీనటులకు నేను ఇలాగే నటిస్తా అనే నిశ్చయానికి వస్తారు. కానీ నేను దర్శకుడి ఆలోచన మేరకు నటిస్తా. అందుకే ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి, ప్రేక్షకులకు నేను బోర్ కొట్టడం లేదు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

