The Paradise | నాని ‘ది పారడైజ్’ మళ్లీ వాయిదా? రవితేజ ‘ఇరుముడి’ కోసమేనా!
The Paradise | నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది పారడైజ్’ మరోసారి వాయిదా పడే దిశగా కనిపిస్తోంది.
The Paradise | నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది పారడైజ్’ మరోసారి వాయిదా పడే దిశగా కనిపిస్తోంది. మొదట మార్చి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఆ తర్వాత ఆగస్టు 21కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ఆగస్టు 21వ తేదీని మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా లాక్ చేసుకోవడంతో నాని సినిమా పోస్ట్‌పోన్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సినిమాకు సంబంధించిన కొంత వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉండటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ‘ది పారడైజ్’ చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని ఇండస్ట్రీ టాక్. బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది పారడైజ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

