Nani 30 | గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని కొత్త సినిమా..!
'దసరా' టీజర్ సందడి ఇంకా కొనసాగుతుండగానే.. నాని తన 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేశాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫాదర్-డాటర్ రిలేషన్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
Nani 30 Movie | ‘దసరా’ టీజర్ సందడి ఇంకా కొనసాగుతుండగానే.. నాని తన 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేశాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫాదర్-డాటర్ రిలేషన్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను తెగ నచ్చేసింది. న్యూఇయర్ కానుకగా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ మంగళవారం ముహూర్తపు సన్నివేశాన్ని ప్రారంభించింది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్‌కు ఉత్సాహాన్నిచ్చాడు.
ఇక బుధవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో ‘సీతారామం’ బ్యూటీ మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హెశమ్ అబ్దుల్ వహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
#Nani30 Pooja Ceremony Clicks 📸😍#MegaStarChiranjeevi @NameisNani @mrunal0801 @shouryuv @HeshamAWMusic @mohan8998 @VyraEnts #Nani #MrunalThakur #MegaStar #Chiranjeevi pic.twitter.com/Xc6Ac5RnEc
— CINEMA RAMPAGE (@CinemaRampage) January 31, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

