నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంటే సుందరానికీ..’ నజ్రియా నజీమ్ ఫహాద్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తమిళంలో ‘అడాడే సుందరా’, మలయాళంలో ‘అహా సుందరా’ టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఈ మూడు భాషల్లో జూన్ 10న ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి లిరికల్ పాట ‘పంచె కట్టు..’ శ్రోతలను ఆకట్టుకోగా..ఈ నెల 9న ఈ చిత్రం నుంచి ‘ఎంత చిత్రం’ అనే పాటను విడుదల చేయబోతున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. సుందరం, లీల ప్రేమానుభూతిని తెలపనుందీ పాట. నదియా, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి, ఎడిటర్ : రవితేజ గిరిజాల, సంగీతం : వివేక్ సాగర్.