నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ అందరిలో ఆసక్తినిపెంచుతున్నది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. శుక్రవారం ఈ సినిమాలోని నాని ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
గుబురు గడ్డం, మీసాలు.. రెండు జడలతో నాని లుక్ ఆయన పాత్రపై ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. ఇందులో ఆయన పాత్ర పేరు కూడా ‘జడల్’ కావడం కొత్తగా అనిపిస్తున్నది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆధిపత్య శక్తులపై పోరాటం కోసం తన జాతిని ఒక్కటిగా చేసి యుద్ధభేరీ మోగించిన ఓ సామాన్యుడి కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.