Nani | నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు.
కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఆయన ఇంటెన్స్ రోల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జె.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళీ.జి, సంగీతం: జేక్స్ బిజోయ్.