తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సుభాష్ కె రాజ్. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో సైతం ఆదరణ చూరగొంటున్నది. దర్శకుడు సుభాష్ కె రాజ్ ఎంచుకున్న కాన్సెప్ట్, మేకింగ్ ైస్టెల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
ఈ యువ దర్శకుడితో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలావుండగా నాని తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.