నానితో లవ్‌స్టోరీ తెరకెక్కిస్తా
హీరో నాని సోదరి దీప్తి ‘మీట్ క్యూట్' చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నది.
హీరో నాని సోదరి దీప్తి ‘మీట్ క్యూట్’ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నది. ఐదు విభిన్న కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్‌లో సత్యరాజ్, ఆదా శర్మ, రోహిణి, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మించారు. ఈ నెల 25 నుంచి ఈ వెబ్ సిరీస్ సోని లివ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ వెబ్ సిరీస్ విశేషాలు తెలిపారు నాని. ఆయన మాట్లాడుతూ…‘నా సోదరి దీప్తి రెండు కథలు రాసి నాకు వినిపించింది. నాకు బాగా నచ్చి ఇలాంటి కథలు మరో మూడు రాయి, ఐదింటినీ కలిపి సిరీస్‌లా నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో ఎక్కడా డ్రామా ఉండదు. ప్రతి పాత్ర, సన్నివేశం సహజంగా సాగుతుంటుంది.
ఈ క్యారెక్టర్స్ ఎలా ముగుస్తాయి అనే ఆసక్తి నాలో కలిగింది. నా సిస్టర్ అనే కాదు వేరే ఎవరు ఈ స్క్రిప్ట్ పంపినా నేను నిర్మించేవాడిని. నా సోదరి దీప్తి దర్శకురాలు కాబట్టి నేను ఇందులో అతిథి పాత్రలో నటిస్తానని అందరూ అంచనా వేస్తారు కానీ నాకు సరిపోయే క్యారెక్టర్ ఈ కథలో లేదు’ అని చెప్పారు. దర్శకురాలు దీప్తి మాట్లాడుతూ…‘నిజ జీవితంలోని సందర్భాలను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కథకు తగినట్లు సత్యరాజ్, రోహిణి, ఆదా శర్మ లాంటి మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆహ్లదకరమైన అనుభూతిని పంచే ఐదు విభిన్న కథలను ఈ సిరీస్‌లో చూస్తారు. మంచి లవ్‌స్టోరీ రాస్తే నాని హీరోగా తెరకెక్కిస్తాను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- deepthi
- Meet Cute teaser
- Nani
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

