నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం నాని పుట్టినరోజును పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని లుంగీ కట్టుకొని బీడీ తాగుతూ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు . వీడియో గ్లింప్స్‌లో బాల్‌ను సిక్సర్‌గా మలచి బ్యాట్‌ను గాల్లోకి విసిరేసి తానే పంతం నెగ్గాననే భావనతో నడచుకుంటూ రావడం ఉత్కంఠను పంచింది. సంతోష్ నారాయణ్ సమకూర్చిన నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది.
సింగరేణి నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని ధరణి అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.