Ante Sundaraniki | ‘అంటే సుందరానికీ’ ప్రోమో సాంగ్ రిలీజ్.. సిగ్నెచర్ స్టెప్స్‌తో అదరగొడుతున్న నాని, నజ్రియా
Ante Sundaraniki Promo Song | నాని.. తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన పేరు. రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంటాడు. ఈయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వెళ్తుంటారు. ఎందుకుంటే ఈయన సినిమాలు కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి. ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఏటా ఒకటి, రెండు సినిమాలతో సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
తాజాగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంటే సుందరానికీ ప్రోమో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను దిగ్గజ సింగర్ శంకర్ మహదేవన్, శ్వేత మోహన్‌లు ఆలపించారు. వివేక్ సాగర్ స్వర పరిచిన ఈ పాట మంచి జోష్ ఇస్తుంది. అటు హిందు సాంప్రదాయాలతో ఇటు క్రిస్టియన్ సాంప్రదాయలతో పెళ్ళిని ఈ పాటలో చక్కగా చూపించారు. నికేత్ బొమ్మి సినిమటోగ్రాఫి బాగుంది. మైత్రి సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

