Taraka Ratna | ముగిసిన ప్రస్థానం.. తారకరత్న అంత్యక్రియల్లో పిల్లల మౌనరోదన
నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో కుటుంబ సభ్యుల, సన్నిహితుల అశ్రు నయనాల మధ్య ముగిసాయి. తారకరత్న కడసారి చూపు కోసం వేలాది సంఖ్యలో అభిమానులు కదిలి వచ్చారు. తారక రత్న తండ్రి మోహనకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
Taraka Ratna | నందమూరి కుటుంబంలో ఒక యువ శకం ముగిసింది. తెలుగు సినిమా జగత్తులోకి ఉవ్వెత్తున ఎగిసిన జ్వాలలా వచ్చిన ఒక యువ తారక్ కేవలం 40 సంవత్సరాల వయసులోనే ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 18న కన్నుమూసిన నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో కుటుంబ సభ్యుల, సన్నిహితుల అశ్రు నయనాల మధ్య ముగిసాయి. తారకరత్న కడసారి చూపు కోసం వేలాది సంఖ్యలో అభిమానులు కదిలి వచ్చారు. తారక రత్న తండ్రి మోహనకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
నిర్జీవంగా పడి ఉన్న తండ్రి పార్థివదేహాన్ని చూసి ఆయన ముగ్గురు పిల్లలు, భార్య పడిన మానసిక వేదన చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళు చెమర్చాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ల కూతురు, కొడుకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక.. తమను ప్రాణంలా చూసుకున్న తండ్రి ఇక తిరిగిరాడని అర్థం చేసుకోలేని ఆ వయసులో.. వాళ్ళు చూస్తున్న అమాయకపు చూపులను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు.
కాగా, తారకరత్న పిల్లల బాధ్యతను బాలకృష్ణ తీసుకున్నాడు. ఇకపై ఆ ముగ్గురు పిల్లలకు అన్నీ తానే అని బాలయ్య చెప్పాడు. జనవరి 27న కుప్పంలో పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురై కింద పడిపోయిన తారకరత్న.. 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయాలో మృత్యువుతో పోరాడి అలిసిపోయి ఓడిపోయాడు.
ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రిలో జాయిన్ చేసిన రోజు నుంచి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తారకరత్న మళ్ళీ క్షేమంగా బయటికి వస్తాడు.. అందరి మధ్యలోకి వచ్చి జనం కోసం నిలబడతాడు అని ఆశించిన అభిమానులకు కన్నీరుని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు తారకరత్న.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

