Bimbisara-2 Movie | ‘బింబిసార-2’ స్టోరీని రివీల్ చేసిన కళ్యాణ్‌రామ్.. కథలో ట్విస్టులు మాములుగా లేవుగా!
Kalyan Ram About Bimbisara Part-2 | నందమూరి కళ్యాణ్‌రామ్‌కు చాలా రోజుల తర్వాత ‘బింబిసార’ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ మీట్లోనే పార్ట్-2 కూడా తెరకెక్కుతుందని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న టీమ్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనుందట.
కాగా పార్ట్-2లో ఏం జరుగుతుందనే దానిపై కళ్యాణ్‌రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ‘పార్ట్-2లో అసలు బింబిసారుడు ఎవరు. తను తన తమ్ముడుని ఎందుకు చంపాలి అనుకున్నాడు. బింబిసార విలన్‌గా మారడానికి కారణం ఏంటి. తన జీవితం చిన్నపటి నుండి ఎలా సాగింది అనేది బింబిసార్ స్టోరీ’ అని కళ్యాణ్‌రామ్ తెలిపాడు. అంతేకాకుండా ‘బింబిసార-2′ విజువల్ గ్రాండియర్‌గా ఉండబోతుంది’ అని చెప్పాడు. దీంతో పార్ట్-2 పై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సుమారు 5 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

