Bimbisara Movie | ఎమోషనల్ ఫీల్‌ను కలిగిస్తున్న ‘బింబిసార’ మూడో సింగిల్..!
Bimbisara 3rd Single | చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు కళ్యాణ్‌రామ్. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు.. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో ప్రేక్షకులో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని 3వ సింగిల్‌ను విడుదల చేశారు.
‘నీతో ఉంటే చాలు’ అంటూ సాగే ఎమోషనల్ గీతాన్ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కీరవాణి స్వర పరిచిన ఈ పాటకు తనే సాహిత్యం అందించాడు. మోహన భోగరాజు, సండిల్యా పిసపాటి ఆపలించారు. లేటెస్ట్గా విడుదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడులైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా మిగిలాయి. ముఖ్యంగా కీరవాణి పాటలు సినిమాకు మంచి బజ్‌ను తీసుకువచ్చాయి. ఇక కళ్యాణ్‌రామ్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. భిన్న జానర్లలో సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే బింబిసార వంటి వినూత్న సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

