బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్స్టాపబుల్’

‘ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమే ‘అన్స్టాపబుల్’ షో కాన్సెప్ట్. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే వ్యాఖ్యాతగా ఒప్పుకున్నా’ అన్నారు బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘అన్స్టాపబుల్’ షో నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. గురువారం కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు సాంఘిక, జానపద, సోషియోఫాంటసీతో పాటు కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించా. ప్రేక్షకులు నాపై అంతులేని ప్రేమాభిమానాలు కనబరిచారు. ‘ఆహా’ ఓటీటీ అంతర్జాతీయ ఓటీటీలకు ధీటుగా ఉంది. ప్రతి రంగంలోనూ ‘ఆహా’ పోటీ పడుతున్నది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడే నిజమైన మనిషి ఆవిష్కరించబడతాడు. అలా చేసే ప్రయత్నమే ‘అన్స్టాపబుల్’. ఇదెంతగానో నాకు నచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నటీనటులతో సంభాషించి వారి మనసులోని భావాల్ని పంచుకుంటా. మీకు చక్కటి వినోదాన్ని అందిస్తా’ అని చెప్పారు. నిజ జీవితంలో ఉన్నదిఉన్నట్లుగా మాట్లాడే బాలకృష్ణతో ఈ షో చేయడం ఆనందంగా ఉందని అల్లు అరవింద్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

