Balakrishna | ఇంకో హిట్ పడితే.. బాలకృష్ణతో నాలుగు బ్లాక్‌బాస్టర్స్ ఇచ్చిన కోడిరామకృష్ణ, ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌ల సరసన చేరతాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అయిదో హిట్ కూడా పడిందంటే.. బాలయ్యతో అత్యధిక విజయాలను తీసిన దర్శకుడిగా రికార్డు సృష్టిస్తాడు. 50ఏళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకోబోతున్న ఓ అగ్ర కథానాయకుడి కెరీర్లోనే అత్యధిక విజయాలు ఇచ్చిన దర్శకుడిగా నిలవడం అంటే అది మామూలు క్రెడిట్ కాదు.
మరి ఆ క్రెడిట్ దక్కించుకోవాలంటే బోయపాటికి కావాల్సింది బాలయ్యతో ఇంకో రెండు హిట్లు. వాటికోసమే రెండు కథలు సిద్ధం చేశారట. వాటిలో ఒకటి ‘అఖండ 2’ కాగా, రెండోది పొలిటికల్ డ్రామా. ఇటీవలే ఈ రెండు కథలనూ బాలయ్యకు వినిపించాడట బోయపాటి. బాలయ్యకు పొలిటికల్ డ్రామా బాగా నచ్చిందని తెలుస్తున్నది. అయితే.. ఎన్నికల వేడి ముగిశాక, బాలయ్య అభిప్రాయంలో మార్పు రావచ్చు అనే టాక్ కూడా బోయపాటి సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. బాలయ్య ఏ కథకి ఓకే చెప్పినా తీయడానికి బోయపాటి, చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.