Nagarjuna | బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత నా సామిరంగా అంటూ ఈ సారి మాస్ అవతారం ఎత్తాడు నాగార్జున. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. పులులంటూ విర్రవీగే ఓ యాభై ఆరు మంది రౌడీలకు అసలు పులి వేట ఎలా ఉంటుందో నాగ్ చూపించబోతునట్లు టీజర్‌తో చిన్న పాటి విధ్వంసమే సృష్టించాడు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన విజయ్ బన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక నాగ్ సైతం వీలైనంత ఎక్కువ టైమ్ ఈ సినిమాకు కేటాయిస్తున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండగను మిస్ చేయోద్దని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట.
నిజానికి నాగ్‌కు సంక్రాంతి పండగ బాగా కలిసి వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగర్రాజు వంటి సూపర్ హిట్ సినిమాలు సంక్రాంతికి వచ్చి కోట్లు కొల్లగొట్టాయి. దాంతో నా సామిరంగా సినిమాకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి దింపాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాతో విలన్‌గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలు నాగార్జున మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు.
నేను లోకల్, ధమాకా వంటి సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించాడు. ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత్ ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నాడు. నాగ్‌కు జోడీగా కాజల్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. మొత్తంగా మంచి కాస్ట్ అండ్ క్రూతో నాగార్జున మాస్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సారి పండక్కి మాస్ జాతరే అంటూ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.