The Ghost | ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో నాగార్జున సేఫ్ గేమ్..!
ప్రవీణ్ సత్తారు ఎలాంటి కథ చెప్పాడో తెలియదు కానీ..‘ది ఘోస్ట్’ (The Ghost) మాత్రం బ్లాక్ బస్టర్ అని నమ్మకంగా చెప్తున్నాడు నాగార్జున. తను ఈ స్థాయిలో నమ్మిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ.
ఎందుకో మరి ‘ది ఘోస్ట్’ సినిమాపై ముందు నుంచి నాగార్జున (Nagarjuna) చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ‘ది ఘోస్ట్’ (The Ghost) ప్రమోట్ చేస్తున్నాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు ఎలాంటి కథ చెప్పాడో తెలియదు కానీ..ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అని నమ్మకంగా చెప్తున్నాడు నాగార్జున. తను ఈ స్థాయిలో నమ్మిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ.
మొన్న సంక్రాంతికి కూడా కరోనా కారణంగా థియేటర్లకు జనాలు వస్తారా..? రారా..? అని భయపడుతున్న సమయంలో.. చాలా కాన్ఫిడెంట్ గా తన బంగార్రాజు విడుదల చేశాడు నాగార్జున. 50% థియేటర్ ఆక్యుపెన్సిలో కూడా దాదాపు 36 కోట్ల షేర్ వసూలు చేసి మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా విషయంలో కూడా ముందు నుంచి చాలా నమ్మకంగా కనిపించాడు నాగ్. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది. ఇప్పుడు ఘోస్ట్ సినిమాకు కూడా ఇదే చెప్తున్నాడు. కాకపోతే బంగార్రాజు కంటే ఈ సినిమాకు తక్కువగా బిజినెస్ జరిగింది.
ప్రవీణ్ సత్తారు ముందు సినిమాలు ఏవి బ్లాక్ బస్టర్ కాలేదు.. కానీ పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకున్నాయి. అందుకే ఘోస్ట్ సినిమాను ఎక్కువ రేట్లకు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20 కోట్లకు మాత్రమే అమ్మినట్లు తెలుస్తోంది. పైగా పోటీలో చిరంజీవి గాడ్ ఫాదర్ ఉండడంతో అది కూడా ఘోస్ట్ సినిమా బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపించింది.
చిరు సినిమా ఉన్నప్పుడు..అది హిట్ టాక్ తెచ్చుకుంటే ఎదురుగా ఏ సినిమా ఉన్న కూడా వాష్ అవుట్ అవుతుంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సిందే. నిజంగా ఘోస్ట్ సినిమాలో ఆ మేటర్ ఉంటే 20 కోట్లు అనేది నాగార్జునకు అసలు లెక్క కూడా కాదు. పాజిటివ్ టాక్ వచ్చింది అంటే కేవలం మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. పైగా ఏషియన్ ఫిలిమ్స్ నిర్మాతలు కావడంతో ఈ సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేస్తున్నారు.
ఎటు చూసుకున్నా కూడా ఈ పండక్కి అందరికంటే ముందు సేఫ్ జోన్ కి వచ్చే అవకాశం నాగార్జునకు పుష్కలంగా ఉంది. కాకపోతే దాని కంటే ముందు సినిమా ఖచ్చితంగా బాగుండాలి. కమర్షియల్ గా సేఫ్ అయ్యేంత విషయం అందులో ఉంటే.. దసరా పండగకు నాగార్జున కలెక్షన్ల పండగ చేసుకోవడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

