గత ఏడాది ‘ది ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు అగ్ర హీరో నాగార్జున. ప్రస్తుతం ఆయన తదుపరి సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తున్నది. 1970-80 దశకం మధ్య ఈ కథ నడుస్తుందని, హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.
ఫిబ్రవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిపింది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా వంటి చిత్రాలతో ప్రసన్నకుమార్ బెజవాడ రచయితగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో పాటు మోహన్‌రాజా దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రానికి ప్రయత్నాలు చేస్తున్నారు.