Nagarjuna | నాగార్జున 100వ సినిమాకు డైరెక్టర్ దొరికినట్టేనా..? ట్రెండింగ్‌లో స్టిల్
Nagarjuna | టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం విజయ్ బిన్ని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే 100వ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Nagarjuna | టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం విజయ్ బిన్ని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నా సామి రంగ (Naa Saami Ranga) టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నాగార్జున 100వ సినిమాకు డైరెక్ట్ దొరికాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నాగ్ కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలిచిపోయే 100వ ప్రాజెక్ట్ కోసం తమిళ దర్శకుడు నవీన్ (Naveen) కథ రెడీ చేసి.. నాగార్జునతో చర్చించాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. నవీన్ తమిళంలో Moodar Koodam తెరకెక్కించగా.. ప్రస్తుతం Agni Siragugalతో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ దర్శకులతో పనిచేసిన నాగ్ ఈ సారి తమిళ్ డైరెక్టర్‌కు తన ప్రతిష్టాత్మక సినిమాను అప్పగించే ప్లాన్ చేస్తున్నట్టు తాజా స్టిల్‌తో క్లారిటీ వచ్చేస్తుంది.
మరి కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ ఎలాంటి కథను నాగ్ కోసం రెడీ చేశాడు. ఈ ఇద్దరి కాంబో ఫైనలైజ్ అవుతుందా..? అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. నా సామి రంగ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసి.. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్‌తో నా సామి రంగ షూటింగ్ షురూ అవగా..
హైదరాబాద్‌లో వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నాగార్జున, ఫైటర్స్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తు్న్నాడు. నా సామి రంగతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్‌గా పరిచయం కాబోతునండటం విశేషం. ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు.
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

