Caste Movie | మెగా బ్రదర్ నాగబాబు తన విలక్షణ నటనతో మరోసారి వెండితెరపై సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం #Caste. ఎ.కె. జంపన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ మరియు కాశికా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నాగబాబు నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 70MM ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు ప్రతిబింబించబోతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి నాగబాబు ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగబాబు “రంగరాజన్” అనే అత్యంత పవర్ఫుల్ మరియు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పోస్టర్లో నాగబాబు గంభీరమైన ముఖ కవళికలతో, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నాగబాబు, ఈ చిత్రంలో తనలోని ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
Introducing the versatile @NagaBabuOffl garu as “RANGARAJAN” from #CasteMovie 🔥🔥 pic.twitter.com/5K6aPR7tX7
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 20, 2026