Naga Shaurya | నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది !
Naga Shaurya |నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
Naga Shaurya | నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘కనుల చాటు మేఘమా’ అనే తొలిగీతాన్ని గురువారం విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ గీతాన్ని లక్ష్మీభూపాల్ రచించారు. అభాస్ జోషి ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లక్ష్మీభూపాల్గారు సందర్భానికి తగినట్లు అర్థవంతమైన సాహిత్యంతో గీత రచన చేశారు.
చక్కటి మెలోడీతో అందరిని ఆకట్టుకునే పాట ఇది. అందమైన ప్రేమకథగా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అని చెప్పారు. సంగీత దర్శకుడిగా తన ఇరవై ఏళ్ల ప్రయాణంలో ఈ పాట ఎంతగానో సంతృప్తినిచ్చిందని కల్యాణి మాలిక్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అవసరాల, మేఘచౌదరి, అశోక్‌కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామ, సంగీతం: కల్యాణి మాలిక్, వివేక్ సాగర్, సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

