మిడిల్‌క్లాస్ ‘నాగేశ్వరరావు’
యువహీరో నాగచైతన్య సినిమాల వేగం పెంచారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’ జూలై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇదిలావుండగా పరశురామ్ దర్శకత్వంలో చైతూ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఇందులో నాగచైతన్య మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తాడని, ఓ ప్రముఖ కంపెనీకి సీఈఓ అయిన కథానాయికతో నాగేశ్వరరావు ప్రేమాయణం ఎలా సాగిందన్నదే చిత్ర కథాంశమని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని రూపొందించ బోతున్నారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

