నాగ చైతన్య ‘కస్టడీ’
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 22వ చిత్రానికి ‘కస్టడీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది.
నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 22వ చిత్రానికి ‘కస్టడీ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. టైటిల్ ప్రకటన సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య పోలీస్ అధికారి శివ పాత్రలో కనిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అయిన శివను పోలీసులే ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందనేది పోస్టర్ ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే..ముందు అది నీతోనే మొదలవ్వాలి అనే మహాత్మ గాంధీ సూక్తి పోస్టర్లో కనిపించింది. ఓ సరికొత్త పోలీస్ స్టోరిని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సంపత్ రాజ్, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎస్ఆర్ కతీర్, సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

